రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (CAA) వంటి చారిత్రాత్మక నిర్ణయాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని ప్రధాని గుర్తు చేశారు. ప్రతి సవాలును ఎదుర్కొనేందుకు బీజేపీ కట్టుబడి పనిచేస్తోందని ప్రజలు గుర్తించారన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో బీజేపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని… హింస రాజకీయ సంస్కృతి వల్ల బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పలువురు బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు . పార్టీని తల్లిలా భావించే కార్యకర్తల కృషితోనే దేశం అభివృద్ధి పథంలో సాగుతోందని ప్రశంసించారు.

