
యూట్యూబ్‌లో వీడియోలు చేసి డబ్బులు సంపాదించే వాళ్లకు బిగ్ అలర్ట్.ఇకపై వ్యూస్ కోసం చేసే వీడియోలపై కఠినంగా వ్యవహరించాలని గూగుల్ నిర్ణయించింది. ఒకే విధమైన లేదా ఏఐ సహాయంతో కంటెంట్‌ను తయారుచేసే క్రియేటర్స్‌పై కొరడా ఝుళిపించనున్నారు. ఈ మార్పు జులై 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది ఒరిజినల్స్‌ను ప్రోత్సహించనుంది. కేవలం వ్యూస్ కోసం తయారు చేసిన వీడియోలను గుర్తించి వాటి రీచ్‌ను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.