ప్రతి కంపెనీకి తమకంటూ స్వతంత్ర AI వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. టెక్ రంగం ‘జీరో సమ్ గేమ్’గా మారకూడదని, ఏఐ కారణంగా ఏర్పడే ఆర్థిక లాభాలు కొందరు టెక్ దిగ్గజాలకే పరిమితమవ్వకుండా అన్ని సంస్థలకు చేరే విధంగా వాతావరణం ఏర్పడాలి అని సూచించారు. నాదెళ్ల చేసిన ఈ దీర్ఘ పోస్టుకు ఎలాన్ మస్క్ మాత్రం ఒక్క ‘ఫేస్పామ్’ ఎమోజీతోనే స్పందించారు. ఈ ఒక్క ఎమోజీతోనే మస్క్ తన అసమ్మతి తెలిపాడా? లేక మరో దృక్పథం ఉందా? అనే చర్చ నెటిజన్లలో రగులుతోంది.

