
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న తరుణంలో, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి AI సినిమా కన్నడలో వచ్చింది. ఈ ‘లవ్ యూ’ అనే సినిమాను కేవలం 10 లక్షలతో AI ద్వారా రూపొందించడం విశేషం.
దర్శక నిర్మాత నరసింహ మూర్తి, AI నిపుణుడు నూతన్ తప్ప నటన, సంగీతం, పాటలు, నేపథ్య సంగీతం, డబ్బింగ్ అన్నీ AIతోనే చేశారు. 95 నిమిషాల సినిమా: “95 నిమిషాల నిడివి గల సినిమాలో 12 పాటలున్నాయి. సెన్సార్ బోర్డు సభ్యులు ఆసక్తిగా సినిమా చూసి U/A సర్టిఫికెట్ ఇచ్చారు.