
అమెరికాలో పెట్టుబడిదారుల కోసం ట్రంప్ కొత్త విధానం తీసుకొచ్చారు. 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే “గోల్డ్ కార్డ్” ఇస్తామంటున్నారు. 5 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 43.5 కోట్ల రూపాయలు అన్నమాట. గోల్డ్ కార్డ్ కొంటే పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం, నివాసం కల్పిస్తామని ట్రంప్ భరోసా ఇస్తున్నారు. మరో రెండు వారాల్లో గోల్డ్ కార్డ్ అమల్లోకి వస్తుంది. గోల్డ్ కార్డ్ అంటే, గ్రీన్‌కార్డ్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్ అనీ, గోల్డ్ కార్డ్ కొటే గ్రీన్‌కార్డ్ కన్నా ఎక్కువ సౌకర్యాలు ఉంటాయని ట్రంప్ ఊరిస్తున్నారు.