
సినీ నటుడు, దర్శకుడు, ఏపీఎఫ్‌టీవీడీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణ మురళీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పోసాని కృష్ణమురళిని సంబేపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్ నుంచి పోసాని కృష్ణమురళిని రాజంపేట తీసుకెళ్లారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో నమోదు అయిన కేసు. ఓబులావారిపల్లి పీఎస్‌లో పోసాని కృష్ణమురళి పై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు అయింది. ఈ కేసులో పోసాని కృష్ణమురళీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.