ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. శ్రీకాళహస్తి, కోటప్పకొండ, పిఠాపురంతో పాటు అనేక ప్రాంతాల్లోని దేవాలయాల్లో భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. నరసరావుపేటలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరుని తొలిపూజతో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి.