
శ్రీశైలం మల్లికార్జున స్వా మి, బ్రమరాంబికామాతకు పొందూరు నుంచి ప్రత్యేకంగా సమర్పించే మల్లన్నపాగా చేనేతవస్త్రం నేతకు శనివారం శ్రీకారం చుట్టా రు. ఏటా శివరాత్రికి శ్రీశైలం దేవస్థానానికి ప్రత్యేకంగా వస్త్రం సమ ర్పించడం ఆనవాయితీ. ఈఏడాది మల్లన్నకు చేనేత పాగా నేసే అవకాశం పొందూరులోని లావేటివీధికి చెందిన బనిశెట్టి ఆంజనే యులకు లభించింది. దీంతో ప్రత్యేకపూజలు నిర్వహించిన అనంత రం నేత పనులు ప్రారంభించారు. మల్లన్నకు పాగాతోపాటు బ్రమరాంబకు పట్టుచీర, బసవన్నకు, గణపతికి ప్రత్యేక వస్త్రాలు నేసి మహాశివరాత్రికి అందిస్తారు.
- 0 Comments
- Kurnool District