
తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘జన నాయగన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు.