
అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు విధ్యంసం ఇంకా కొనసాగుతూనే ఉంది. అత్యంత సంపన్నులు ఉండే ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చుతో ఇప్పటికే వందల ఇండ్లు బూడిదయ్యాయి. ఇందులో పలువురు హాలివుడ్ హీరోల ఇండ్లు కూడా ఉన్నాయి. కార్చిచ్చు కారణంగా ఇప్పటికే 24 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 88వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.