ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం దాదాపు 3 గంటలపాటు జరిగింది. వర్చువల్ గా జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చే 30 అంశాల అజెండాకు ఆమోదం తెలిపింది. అమరావతిలో సచివాలయ నిర్మాణ వ్యయాన్ని రూ.6,641 కోట్లకు పెంచడం, హైకోర్టు, అసెంబ్లీ భవనాల పనులు, శాఖమూరులో అమరావతి సంగమం అభివృద్ధి, రాజధాని గ్రామాల్లో రూ.1,215 కోట్ల మౌలిక వసతుల పనులపై చర్చించారు.