విజయవాడ నగర ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్ల సమక్షంలో మేయర్ గా బాధ్యతలు చేపట్టానని మేయర్ వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ప్రజలు మా మీద నమ్మకంతో ఇచ్చిన తీర్పు నాకు అనుగుణంగా ప్రజలందరి నమ్మకాన్ని నిలబెట్టేలా పని చేస్తానని పేర్కొన్నారు. అధికారికంగా విజయవాడ కార్పొరేషన్ మేయర్ గా వంగవీటి రాధాకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన అనంతరం తన ఛాంబర్ లో అడుగు పెట్టారు. ముందుగా శానిటేషన్, హెల్త్ సమస్యలు పరిష్కారం కోసం డ్రైవ్ చేపట్టేలా తొలి ఫైల్ పై సంతకం చేశారు.