కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా తీరానికి చేరుకున్నారు. బోటులో గేర్ బాక్స్ మొరాయించడంతో తిరిగి రావడంలో ఇబ్బంది పడిన వీరు, గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఉప్పాడ తీరానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఒడిశా వైపు వేటకు వెళ్లినట్లు, ఆ తర్వాత ఫోన్ సిగ్నల్స్ అందకపోవడంతో ఎవరికీ సమాచారం ఇవ్వలేకపోయామని మత్స్యకారులు స్పష్టం చేశారు.