బంగారం ఆభరణాలతో తరచూ వార్తల్లో కనిపించే హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్‌కు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తి వ్యవహారంలో బినామీ నిరోధక విభాగం కీలక చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న భారీ అపార్ట్మెంట్ భవనాన్ని తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ ఆస్తి కొనుగోలు, నిర్మాణానికి సంబంధించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై జరిపిన విచారణలో పలు వివరాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.