ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మహిళా ప్రొఫెసర్‌కు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విచారణ కమిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆల్దాస్ జానయ్య ఇంకా వీసీ హోదాలో కొనసాగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. బాధిత మహిళా ప్రొఫెసర్‌కు న్యాయం జరగాల్సిన సమయంలో ఆమెకు మరింత అన్యాయం జరుగుతోందని వాపోయారు.