టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ స్పందించారు. తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.ఆయన SMలో వీడియో విడుదల చేశారు. ‘‘నిన్న రాత్రి ఓ పాట షూటింగ్ కోసం వెళ్లాం. తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో షూట్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో మా కారు ప్రమాదానికి గురైంది. దీంతో కారు తీవ్రంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో వాహనంలో నలుగురం ఉన్నాం. అయ్యప్పస్వామి దయ వల్ల ఎవరికీ ఏం కాలేదు. అని మాస్టర్ వెల్లడించారు.