పవన్ కల్యాణ్ విడాకుల నేపథ్యంలో సంఘీభావం తెలుపుతూ ట్విట్టర్ స్పేస్లో జనసేన బ్యాచ్ అరాచకం సృష్టించింది. ట్విట్టర్ స్పేస్లో పాల్గొన్న దాదాపు 350 మంది జనసేన బ్యాచ్.. తల్లులు, భార్యలను దూషిస్తూ.. దారుణంగా మాట్లాడారు. వినడానికి వీల్లేని రీతిలో జనసేన మూకలు రెచ్చిపోయారు. పవన్ కల్ట్ చూపిస్తామంటూ వైఎస్ జగన్ కుటుంబంపై దారుణమైన భాష ఉపయోగించారు. మహిళలు, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఆన్ లైన్ లో దుష్ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేయిస్తున్నామని వైసీపీ లీగల్ సెల్ పేర్కొంది.