జమ్మూకశ్మీర్ కిష్ట్వార్ జిల్లా దచ్చన్-మర్వా సరిహద్దుల్లోని రష్పాల్ కుమార్ (40), బాబీ చంద్ (54) అనే ఇద్దరు ఎస్పీఓలు తమ విధుల్లో భాగంగా… పెట్రోలింగ్ నిర్వహించిన అనంతరం బయలుదేరారు. అయితే, వారు ఎంతసేపటికీ గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో అనుమానం వ్యక్తమైంది. రహస్యంగా పొంచి ఉన్న ఉగ్రవాదులు లొకేషన్‌ను ఆధారం చేసుకుని అకస్మాత్తుగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు అధికారుల శరీరాలపై బుల్లెట్ గాయాలు లభ్యమయ్యాయి. ఉగ్ర మూకలు అత్యంత దారుణంగా ఒకరి తలపై, మరొకరి వీపుపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసినట్లు ప్రాథమిక ఆధారాలు చెబుతున్నాయి

