ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ వేదికగా జరిగిన అంతర్జాతీయ చైనీస్ మార్షల్ అర్ట్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెలంగాణకు చెందిన గులాం ముస్తఫా ఖాన్ స్వర్ణాల పంట పండించాడు. ఈ పోటీల్లో ముస్తఫా ఏకంగా ఆరు పసిడి పతకాలు సాధించి పెను ప్రకంపనలు సృష్టించాడు. న్యూ ఇంగ్లండ్ ఇంటర్నేషనల్ చైనీస్ మార్షల్ అర్ట్ పేరిట జరిగిన ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన హైదరాబాద్ ఆటగాడు ముస్తఫా అద్భుత ప్రదర్శనతో అలరించాడు.

