ఇజ్రాయెల్ దేశంలో సుదీర్ఘకాలం పాటు ప్రధానమంత్రిగా చక్రం తిప్పిన బెంజమిన్ నెతన్యాహుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మాజీ సైన్యాధ్యక్షుడు, ప్రముఖ విపక్ష నేత గాడి ఐసన్కోట్ను దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ అధికారికంగా ఆహ్వానించారు పార్లమెంట్లో కనీస మెజారిటీ మార్క్ అయిన 61 స్థానాల బలాన్ని నిరూపించుకోవడానికి ఐసన్కోట్కు అధ్యక్షుడు 28 రోజుల గడువు ఇచ్చారు. డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్గా అనేక కీలక రక్షణ ఆపరేషన్లను విజయవంతంగా నడిపించిన చరిత్ర గాడి ఐసన్కోట్కు ఉంది