ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 13వ తేదీ నాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడనం మరింత బలపడుతూ నవంబర్ 15 నాటికి నైరుతి బంగాళాఖాతం వైపు పయనించవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మళ్లీ వర్షపాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న 24 నుంచి 48 గంటల్లో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉందని హెచ్చరించింది.