స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పుంగనూరులో చోటుచేసుకున్న దాడి ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. రాజంపేట ఎంపీ మిథున్రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. పర్యటన సందర్భంగా ఎదురైన పరిస్థితులు, దాడి జరిగిన తీరు, అక్కడ నెలకొన్న ఉద్రిక్తతల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్.. పార్టీ నేతలు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే వైఎస్సార్సీపీ నాయకులు,
అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.