వైసీపీ నుంచి విశాఖ, గుంటూరు మేయర్ అభ్యర్దుల పైన స్పష్టత వచ్చింది. విశాఖ మేయర్ అభ్యర్దిగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేరు ఖరారు చేసినట్లు సమాచారం. టీడీపీ నుంచి విశాఖ ఎంపీ శ్రీభరత్ భార్య తేజస్విని పేరు తొలుత ప్రచారంలోకి వచ్చినా.. తరువాత పార్టీ నేతలే తేజస్విని పోటీలో ఉండరని స్పష్టత ఇచ్చారు. గుంటూరు నుంచి నూరీ ఫాతిమా పేరు ఖరారైంది. ప్రస్తుతం గుంటూరు తూర్పు ఇంఛార్జ్ గా ఉన్న నూరీ ఫాతిమాను మేయర్ బరిలో దింపాలని డిసైడ్ అయ్యారు.