ఫ్రాన్స్ దేశంలో హై స్కూల్ విద్యార్థుల నిరసనలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. మంగళవారం జరిగిన ఆందోళనల్లో ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ చేయి కోల్పోవాల్సి వచ్చింది. పాఠశాలల్లో సరిగ్గా మౌలిక వసతులు లేకపోవడం, విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేకపోవడం, పాఠశాల విద్యా శాఖకు సరైన బడ్జెట్ కేటాయించకపోవడం వంటి కారణాలతో విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనలు దేశాన్ని చుట్టేశాయి. రాజధాని పారిస్ నగరాన్ని ముట్టడించేందుకు దేశం నలువైపులా సుమారు 86 వేల మంది విద్యార్థులు చేరుకున్నారు. దీంతో వీరిని నిలువరించడం పోలీస్ అధికారులకు కష్టతరంగా మారింది.

