విద్యుత్ కోతలు, పెరిగిన బిల్లులతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శించారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో వినియోగదారులపై రూ.5,420 కోట్ల భారం మోపాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని, ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు.

