ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎంపీలు ఎన్నికల సంఘాన్ని కలవాలని చేసిన ప్రయత్నంపై ఎన్నికల సంఘం స్పందించింది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఏ రాజకీయ పార్టీ కూడా అధికారికంగా అపాయింట్మెంట్ కోరలేదని, ఆ తర్వాత వచ్చిన సమావేశ ప్రతిపాదనను నిబంధనలకు విరుద్ధంగా భావించి ఆమోదించలేదని తెలిపింది. సాయంత్రం 4 గంటల తర్వాత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఎంపీల బృందం కమిషన్ను కలిసి వినతిపత్రం సమర్పించాలనుకుంటున్నట్లు ఢిల్లీ పోలీసుల నుంచి సమాచారం అందిందని ఎన్నికల సంఘం తెలిపింది.

