ఉత్తర ప్రదేశ్ మథురలో ఉన్న ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమంలో సాధకుడిగా ఉన్న రసిక్ దులారి అనుమానాస్పద మృతి వెనుక విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబర్ 25న ఉదయం 10.25 గంటలకు తన గదిలో నుంచి బయటకొచ్చిన రసిక్ దులారి.. నేరుగా భవనంపైకి వెళ్లి నాలుగో అంతస్తు నుంచి దూకి మరణించాడు. అంతకంటే ముందు గ్రైండర్తో తన ప్రైవేట్ పార్ట్ కట్ చేసుకుని మెట్లు ఎక్కినట్లు సీసీ టీవీలో స్పష్టంగా తెలుస్తోంది. రక్తంతోనే నాలుగో అంతస్తు వరకు ఎలా వెళ్లారనేది మిస్టరీగా మారింది.

