ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో తీవ్రంగా గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రస్తుతం యూఏఈలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశ యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న యువరాజు.. ప్రమాద సమయంలో కెప్టెన్ వ్యవహరించిన తీరును కొనియాడారు. ప్రాణాపాయం పొంచి ఉన్నప్పటికీ వెనకడుగు వేయకుండా, అత్యంత ధైర్యసాహసాలతో, బాధ్యతాయుతంగా వ్యవహరించినందుకు గాను యూఏఈ ప్రజల తరఫున స్మిత్‌ను ప్రశంసించారు యువరాజు.