సౌతాఫ్రికాలోని వెస్ట్రన్ కేప్ ప్రావిన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మినీ బస్ టాక్సీలు ఒకదాన్నొకటి ఢీ కొన్న ఘటనలో 21 మంది మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వెస్ట్రన్ కేప్ ప్రావిన్స్ లోని ఎన్ 1 హైవేపై జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రిన్స్ ఆల్బర్ట్ అలాగే లీయూ- గమ్కా ప్రాంతాల మధ్య ఈ ఘటన జరిగింది. సౌతాఫ్రికాలో మిని బస్సు ట్రాన్స్ పోర్టు సర్వీసులు సాధారణ ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నాయి