బ్రిక్స్ సదస్సులో ఒక అన్‌సీన్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ఎంతో సన్నిహితంగా కనిపిస్తున్నారు. ముగ్గురు నేతలు కలిసి సరదాగా ముచ్చటిస్తూ, నవ్వులు చిందిస్తూ కనిపించిన దృశ్యాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. దౌత్యపరమైన గంభీరతను పక్కనపెట్టి ప్రపంచ దిగ్గజాలు పరస్పరం ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటూ, చేతులు పట్టుకుని మాట్లాడుకున్న క్షణాలు ఈ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.