రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేసేలా, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సక్రమంగా నెరవేర్చేలా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌కి ఆ విఘ్నేశ్వరుడు సరైన ‘సద్బుద్ధి’ని ప్రసాదించాలని తాను స్వామివారిని వేడుకున్నట్లు రాంచందర్ రావు తెలిపారు. పండుగ వేళ ప్రజల ఆశలను నిజం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో గణేశ్ మండపాల నిర్వాహకులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కోరారు.