ప్రధాన డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఇవాళ (శుక్రవారం) ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. శుక్రవారం ఉద్యోగుల సమ్మె ఉండగా.. మరుసటి రోజు రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం సాధారణ వారాంతపు సెలవులు వచ్చాయి. దీనికి తోడు సోమవారం వినాయక చవితి పండుగ కావడంతో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.