<జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ప్రపంచవ్యాప్తంగా లక్ష ఉద్యోగాలను తొలగించేందుకు నిర్ణయించినట్లుగా ప్రకటించింది. ఈ దశాబ్దం చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుందని వెల్లడించారు. ఇప్పటికే 50 వేల ఉద్యోగాల కోతకు అంగీకరించగా.. తాజాగా మరో 50 వేల పోస్టులను తొలగించేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పింది. ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలో దాదాపు 6.67 లక్షల మంది పనిచేస్తున్నారు. ఒక్క జర్మనీలోని దాదాపు 43 శాతం మంది విధులు నిర్వహిస్తున్నారు.