ఖమ్మం జిల్లా అంగన్వాడీ కేంద్రం 3 లో చిన్నారులకు అందించిన ఆహారంలో బచ్చలికూర ఆకులతో గన్నేరు ఆకులు పప్పుతో కలిసి కూర చేసినట్టు సమాచారం. దీంతో ఐదుగురు చిన్నారులు అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. అయితే ఈ ఘటనను బయటకు రాకుండా మూడు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే పిల్లలకు చికిత్స అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం విషమించడంతో ఖమ్మం ఆసుపత్రి నుండి వరంగల్ తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.