ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించిన సమయంలో బందోబస్తుకు సంబంధించిన అత్యంత రహస్య వివరాలను సోషల్ మీడియాలో బహిర్గతం చేసిన ఘటనలో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ భద్రతా వివరాలను పోస్ట్ చేసినందుకుగానూ తెలుగు స్క్రైబ్ ఎక్స్ ఖాతా నిర్వాహకులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.అధికారుల్లో ఎవరైనా అక్రమంగా ఈ సమాచారాన్ని ఆ సోషల్ మీడియా ఖాతాకు చేరవేసి ఉంటారని సీఎస్వో తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు.