కోల్కతాలో టీఎంసీ నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. గురువారం తెల్లవారుజామున మాస్కులు, హెల్మెట్లు ధరించిన దుండగులు కార్యాలయంలోకి ప్రవేశించి నానా రభసా సృష్టించారు. వస్తువులను చెల్లాచెదురుగా పడేసి, అద్దాలను పగలగొట్టారు. కొన్నింటి వస్తువులను తమ వెంట తీసుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను అభిషేక్ బెనర్జీ షేర్ చేశారు. ఈ దాడి వెనుక బీజేపీ ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ గవర్నర్, హోం మంత్రి అమిత్ షా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు.