ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రారంభమైందీ భారీ ఎక్స్‌ప్రెస్‌వే. ఈ నాలుగు నెలల కాలంలోనే ఇలా దెబ్బతినడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు అనుసంధానించే ఈ రహదారిలో ఉన్నవ్ జిల్లా సోనిక్ ప్రాంతం పరిధిలో 421 కిలోమీటర్ వద్ద గల ఇది భారీగా కుంగిపోయింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్డు పక్క భాగం కొట్టుకుపోయింది. రహదారి పక్కనే ఏర్పాటు చేసిన ర్యాంప్ వద్ద మట్టి, గ్రావెల్.. వర్షపు నీటి ఉధృతికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.