మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ఇండియా యంగ్ షట్లర్ ఆయుష్ శెట్టి చరిత్ర సృష్టించాడు. ప్రపంచ నంబర్ వన్ షి యు క్వి (చైనా)తో తలపడిన ఆయుష్.. అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. గంటా 13 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆయుష్ 21–14, 13–21, 21–19 తేడాతో షి యు క్విపై సంచలన విజయం సాధించాడు. చివరిలో 20–20 స్కోరు వద్ద ఒత్తిడిని జయించి, వరుసగా రెండు పాయింట్లు నెగ్గి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.