హైదరాబాద్ బండ్లగూడ మండలం పరిధిలోని బండ్లగూడ విలేజ్ సర్వే నెంబర్ 62లో ఉన్న సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ వివాదంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సదరు విద్యాసంస్థకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేవని పాఠశాల విద్యాశాఖ ఉన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. చివరి అవకాశంగా వారం రోజుల్లోగా పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాలని జీహెచ్‌ఎంసీ, విద్యాశాఖ సహా సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలను హైకోర్టు ఆదేశించింది.