ఇరాన్ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు నడిపించిన మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి ఆ దేశం ఘనంగా నివాళులర్పించింది. రాజధాని టెహ్రాన్‌లోని ప్రసిద్ధ గ్రాండ్ మొసల్లా వేదికగా శుక్రవారం నాడు నిర్వహించిన ప్రత్యేక వీడ్కోలు కార్యక్రమంలో ఇరాన్ అగ్రశ్రేణి నాయకులు, వేలాది మంది ప్రజలు పాల్గొని ఆయనకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, విదేశాంగ మంత్రి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఇరాన్ అత్యున్నత నేత మృతికి సంతాపంగా ఆ దేశ ప్రభుత్వం వారం రోజుల పాటు జాతీయ సంతాపాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా జాతీయ జెండాలను సగం వరకు వంచారు.