బండ్ల గణేశ్ కుటుంబం తీసుకున్న రుణాల వసూళ్ల ప్రక్రియలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూబ్లీహిల్స్‌లోని వారి ఆస్తిని వేలం ద్వారా విక్రయించింది. దాన్ని రద్దు చేయాలని గతంలో డెట్ రికవరీ ట్రైబ్యునల్ (DRT) పేర్కొంది. DRT ఇచ్చిన పాత తీర్పును హైకోర్టు కొట్టేసింది. రుణాల వసూళ్ల కోసం బ్యాంక్ జరిపిన ఆస్తి వేలం చట్టబద్ధమేనంటూ తీర్పు వెలువరించింది. తాజాగా హైకోర్టులో మాకు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. అయినప్పటికీ త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను” అని ఆయన స్పష్టం చేశారు.