ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర అధికారికంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఖమేనీతో పాటు మృతి చెందిన కుటుంబసభ్యుల శవపేటికలనూ మద్దతుదారుల సందర్శనార్థం రాజధాని నగరం టెహ్రాన్లో ఉంచారు. వాటిల్లో ఆయన 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మదీ శవపేటిక కూడా ఉంది. దానిపక్కనే ఆ చిన్నారి ఫొటో ఫ్రేమ్ ను ఉంచారు.