కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. కొద్ది నెలల క్రితం కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసారు. తెలంగాణ రక్షణ సేనగా పార్టీ పేరు ప్రకటించారు. తమ పార్టీ మూలాలతో ముడిపడి ఉన్న TRS పేరును ఎట్టి పరిస్థితుల్లో కవిత పార్టీకి రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు చేశారు. తాజాగా ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ పేరును మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికారికంగా కవితకు లేఖ రాశారు.