ఆహ్లాదం..ఆనందం..ప్రశాంతత అందించే ఆధ్యాత్మిక విశాఖపట్నం బీచ్ ప్రాంతాన్ని బీర్లు, మత్తు ప్రాంతంగా మార్చుతారా? ఇదేనా సంపద సృష్టి అంటే చంద్రబాబు అంటూ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం ఎదురుగా బీచ్ లో శనివారం వినూత్న నిరసన చేపట్టారు. డ్రామా కోణంలో పసుపు చొక్కాలు వేసుకుని టిడిపి శ్రేణులతో బీచ్ రోడ్ లో బీర్లు, వైన్లు, చీకుళ్ళు దుకాణాలు పెట్టి అమ్ముతున్న వైనాన్ని ప్రదర్శిస్తూ వైసీపీ శ్రేణులతో ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ హోరెత్తించారు.