పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాను ముంబైలో మూవీ షూటింగ్ లో ఉన్నందున ఆన్ లైన్ విచారణకు హాజరవుతానని అల్లు అర్జున్ కోర్టును అభ్యర్థించారు. అయితే అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. ఆన్ లైన్ విచారణ కుదరదని.. కోర్టుకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో సోమవారం నాంపల్లి కోర్టులో ప్రత్యక్షంగా అల్లు అర్జున్ హాజరుకానున్నారు.