అగర్వాల్ తన కాబోయే భార్య పుట్టినరోజు వేడుకల కోసం ఆమెతో మరియు ఇద్దరు స్నేహితులతో కలిసి గురువారం ఉదయం మావల్ తహసీల్‌లోని లోహగడ్ కోటకు వెళ్లాడు. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో, ఫోటోలు తీస్తుండగా కొండ అంచు వద్ద కాలు జారి సుమారు 400 అడుగుల లోతులో ఉన్న లోయలోకి పడిపోవడంతో అతను తీవ్ర గాయాలపాలై మరణించాడు. అగర్వాల్ వివాహం నవంబర్‌లో జరగాల్సి ఉంది ఈ ఘటన జరిగిన సమయంలో బలమైన గాలులు వీస్తున్నాయని లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దినేష్ తాయ్డే లిపారు.