ఏపీలో జరిగిన డీఎస్సీ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అవినీతిమయం అయిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో పనిచేసే వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరగాల్సిందే. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందోని ఆరోపించారు. ఇప్పుడు అమరావతి అంశం పైన కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు వైసీపీ సమాయత్తం అవుతోంది. ఇదే విషయాన్ని పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదికగా స్పష్టం చేసారు.