ఒక 60 ఏళ్ల రోబోటిక్స్ ఇంజనీర్ తన వినూత్న ఫ్యాషన్ శైలితో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నారు. సాధారణంగా పురుషులు ప్యాంటు, షర్టు ధరించి ఆఫీసులకు వెళ్తుంటే, ఇతడు మాత్రం ప్రతిరోజూ పెన్సిల్ స్కర్టులు, హై హీల్స్ వేసుకుని కార్యాలయానికి వెళ్తుంటారు. దుస్తులకు లింగభేదం ఉండకూడదని, నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ అందరికీ ఉండాలని ఆయన నమ్ముతారు. మూడు పదుల వయసున్న కూతురు, భార్య ఉన్న అతడు.. తన కుటుంబం కూడా ఈ ఫ్యాషన్‌ను ఎంతో సమర్థిస్తుందని చెబుతున్నారు.