ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముంబైలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ ఉన్నత స్థాయి భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఏపీలో వ్యాపార అనుకూల వాతావరణం మరియు విద్యా రంగంలో ప్రవేశపెడుతున్న నూతన సంస్కరణలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

