DyCm పవన్ కళ్యాణ్‌పై వస్తున్న భూకబ్జా ఆరోపణలపై సోషల్ మీడియాలో జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పవన్ కళ్యాణ్ జీవితాన్ని త్యాగం, నిజాయితీ, ప్రజాసేవకు ప్రతీకగా అభివర్ణించారు. ఆయనపై వస్తున్న ఆరోపణలు వాస్తవాల ఆధారంగా కాకుండా రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్న ప్రచారమని పేర్కొన్నారు. ప్రజల్లో పెరుగుతున్న పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని తట్టుకోలేక కొందరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జన్వాడలో ఉన్న భూమి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి అని, దానిపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నమని పేర్కొన్నారు.